సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వ్యక్తి బుధవారం అరెస్ట్ అయ్యారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమాస భాను అలియాస్ రాజేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ బ్రహ్మం మాట్లాడుతూ.. ఉద్యోగాల పేర్లు చెప్పే వారి మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.