నందిగామ మండలం ఐతవరంలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఐతవరం గ్రామం బీసీ కాలనీలో చింతల నాగేంద్రమ్మ (33) అదే గ్రామానికి చెందిన తోగటి హనుమంతరావుతో ఏడాదిగా సహజీవనం చేస్తోంది.
కాగా వీరు కొంతకాలంగా తరచుగా గొడవపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నాగేంద్రమ్మను హనుమంతరావు హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.