ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌కు ప్రాణ హాని.. ఆయన వెంట ఉండాలి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 15, 2025, 05:30 PM

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై మరోసారి చర్చ జరుగుతోంది. జగన్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రత ఉంది. అయితే ఆయన సెక్యూరిటీ వింగ్‌లో కీలక అధికారిగా డీఎస్పీ ఎస్ మహబూబ్ భాషా ఉండాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. జగన్‌కి ప్రాణహాని ఉన్నందున జెడ్ ప్లస్ భద్రత ఉందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com