ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రావడం స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం హర్షనీయమని చెప్పారు. ఆంధ్ర శశికళ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే ఆ పార్టీ నాశనం అవుతుందని ఆరోపించారు. సజ్జల పెట్టే మానసిక క్షోభ వల్ల వైసీపీలో ఇమడలేక ఆ పార్టీ నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులు కూటమి పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారని డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.