ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయింది.. మహా కుంభమేళా వైరల్ గర్ల్

national |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2025, 07:57 PM

ఇటీవలె తన స్వస్థలానికి వెళ్లిన మోనాలిసా.. తాజాగా ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అందులో తన సోషల్ మీడియా అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. అంతేకాకుండా తనను సపోర్ట్ చేస్తూ.. తనపై ప్రేమ చూపిస్తున్న వారందరికీ మోనాలిసా థ్యాంక్స్ చెప్పింది. ఈ క్రమంలోనే తన గ్రామం, తన ఇల్లు గురించి వివరించింది. తమ కుటుంబం నివసించే ఇల్లు ఎలా ఉందో అందులో చూపించింది. అది మా సొంత ఇల్లు అని.. ఆ గ్రామంలో 100 మందికి పైగా జనం ఉంటున్నారని పేర్కొంది. తాను మహా కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్మడానికి ప్రయాగ్‌రాజ్ వెళ్లినట్లు చెప్పింది.


అయితే తాను సోషల్ మీడియాలో ఓవర్‌నైట్‌లో వైరల్ అయి.. సెలబ్రిటీని కావడంతో అక్కడ దండలు అమ్మడం కుదరలేదని చెప్పింది. ఒకానొక దశలో తనను కాపాడటం కూడా తన కుటుంబ సభ్యులకు కష్టంగా మారిందని తెలిపింది. అదే సమయంలో ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కూడా ఎవరో హ్యాక్ చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన ఐడీని హ్యాక్ చేసిన తిరిగి ఇవ్వాలని.. తాను ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎంతో కొంత సంపాదించాలనుకున్నానని మోనాలిసా వెల్లడించింది. తనకు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ మోనాలిసా ధన్యవాదాలు తెలిపింది. అన్ని పరిస్థితులు బాగుంటే మరోసారి కుంభమేళాకు వస్తానని మోనాలిసా స్పష్టం చేసింది.


ఇటీవల మహా కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసాను చూసేందుకు అక్కడికి వెళ్లిన యూత్, భక్తులు, మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తెగ వెంటపడ్డారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు, ఇంటర్వ్యూలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంబడిస్తూ.. తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె వ్యాపారం తగ్గిపోయింది. ఇక మోనాలిసాను కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఎప్పుడూ వెంట ఉండటంతో వాళ్ల వ్యాపారం కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె అక్కడే ఉంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని భావించిన మోనాలిసా కుటుంబం ఆమెను తమ స్వగ్రామానికి పంపించేశారు. ఇటీవల ఆమె రైలులో ఇంటికి వెళ్తూ.. వీలైతే మళ్లీ కుంభమేళాకు వస్తానని తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com