AP: మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా హిందూపురం పట్టణంలో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లోకి మున్సిపల్ కమిషనర్ అనుమతించిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించేందుకు అనుమతి ఉందని చెప్పారు. గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలు నిషేధమని పోలీసులు తెలిపారు.