జిల్లాలో దారుణం జరిగింది. పెదనందిపాడులో కామోన్మాది ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఓ వృద్దురాలి పై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు.పాలపర్తి మంజు అనే కామోన్మాది అత్యాచారం, హత్య కేసులో జైలుకు వెళ్లాడు. 3 రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో ఓ గుడిసెలో ఒంటరిగా ఉంటున్న 64 ఏళ్ల వృద్గురాలిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పాలపర్తి మంజు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2023, 2024లలో రెండు అత్యాచార ఘటనలకు పాల్పడ్డాడు. పాలపర్తి మంజు నేర చరిత్రపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో ప్రైవేట్ ఇంటర్ కళాశాల విద్యార్థినిపై లెక్చరర్ విజయవర్థన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. గత నెల 28న విద్యార్థినిని విజయవాడ తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. అక్కడి నుంచి అనంతపురం, భీమవరం ప్రాంతాల్లో తిప్పి బాలికను ఇంటికి పంపించాడు. మోసపోయినట్లు గ్రహించిన విద్యార్థిని కోవ్వూరు పోలీస్ స్టేషన్లో ఇంగ్లీషు లెక్చరర్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో లెక్చరర్‌పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
కాగా తూ.గో.జిల్లా, నల్లజర్ల మండలం, పోతవరం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా నడుపుతూ వ్యాన్‌ను డీ కొట్టింది. అనంతరం మోటార్ సైకిల్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్ బైక్‌పై వెళుతున్న తానేటి హరిచంద్ర(20) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.అనకాపల్లి జిల్లా, మాకవరపాలెం మండలం, దాలింపేట వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మోటారు సైకిల్, కారు ఢీ కొన్నాయి. మోటారు బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు ప్రమాదం జరిగింది. బాధితులను చికిత్స నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వాసుత్రికి తరలించారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాము అనే వ్యక్తి మృతి చెందాడు. మృతిని భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం తరలించారు. మృతిని మేనకోడలుకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మాకవరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.