సోమవారం ఉదయం 11 గంటలకు తిరుపతి SV యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఓటింగ్ జరగాల్సి ఉంది.తమ పార్టీ అభ్యర్థిగా శేఖర్ రెడ్డిని ప్రకటించిన వైసీపీ, ఆ తర్వాత లడ్డు భాస్కర్‌ను ప్రకటించింది. వైసీపీ కార్పొరేటర్లను చిత్తూరులో నిర్బంధించారన్న సమాచారం హాట్ టాపిక్ మారింది. విషయం తెలుసుకుని టీడీపీ నేతకు చెందిన భాస్కర హోటల్‌కు చేరుకున్నభూమన అభినయ్ హోటల్ గదుల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేటర్లను హోటల్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు అభినయ్. టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు యత్నించిన అభినయ్ వాహనాలను అడ్డుకోవడం, వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ కూటమి నేతలతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సుద్దుమణిగింది.ఎట్టకేలకు వైసీపీ కార్పొరేటర్లు అభినయ్ వెంట వెళ్లారు. ఈ పరిణామాల క్రమంలో 11 గంటలకు SV యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. మరి డిప్యూటీ మేయర్ ఎన్నిక సమావేశానికి ఏయే కార్పొరేటర్లు హాజరు అవుతారన్నదే ఇప్పుడు ఉత్కంఠ.గతంలో డిప్యూటీ మేయర్‌గా ఉన్న భూమన అభినయ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఇప్పుడు అక్కడ ఎన్నిక జరుగుతుంది. 50 డివిజన్‌లలో 49 డివిజన్‌లకు ఎన్నికలు జరిగితే 48 మంది వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఒక స్థానంలో టీడీపీ గెలిచింది.