రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళాఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని శివారెడ్డిఅన్నారు. అసోసియేషన్ లో భాగమైన మహిళా ఉద్యోగుల విభాగం కార్యవర్గ సమావేశం సోమవారం గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీజీఓ హోమ్ లో జరిగింది. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్జీజీఓ సంఘంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.