హిందూపురం మున్సిపాలిటీని తెదేపా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ ఎన్నికయ్యారు. ఆయనకు 23 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna), ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. (Andhra Pradesh News)aనెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తెదేపా మద్దతు అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజారిటీతో ఆమె ఎన్నికయ్యారు. ఆమె 41 ఓట్లు, వైకాపా అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు వచ్చాయి. తహసీన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.