తప్పు చేసినవారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే. ఈరోజు వల్లభనేని వంశీ, రేపు కొడాలి నాని. ఒకరి తర్వాత ఒకరు... అందరూ జైలుకు వెళతారు. చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు’ అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పేర్నినాని, అనంతబాబు వంటి వారిని ఇంకా జైలుకు పంపలేదని చాలామంది టీడీపీ అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. అక్రమ కేసులు, కక్ష సాధింపులు, అవసరంఅయితే ఎన్కౌంటర్లు చేయడాలు... అన్నీ వైసీపీకే సాధ్యం. మా పార్టీకి అలాంటి అలవాటు లేదు’ అని చింతమనేని అన్నారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ... ‘తాడేపల్లి సైకో బాస్‌ను సంతృప్తపర్చడానికి తాపత్రయపడిన వంశీ చివరికి జైలుపాలు కావల్సి వచ్చింది. వంశీ లాంటివారిని బయటకు వదలకూడదు. జైల్లోనే ఉంచాలి. జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటే వంశీ గన్నవరాన్ని దోచుకున్నాడు’ అని విమర్శించారు.
![]() |
![]() |