రాష్ట్రంలో ఎండలు ఓ వైపు భగభగ మండుతున్నాయి. మరోవైపు వర్షాలు పడి రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. అయితే మంగళవారం రాష్ట్రంలో 52 మండలాల్లో వడగాలులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అకాల వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.
![]() |
![]() |