విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శారదా పీఠానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన శాశ్వత కట్టడాలను తొలగించాలని జీవీఎంసీ స్పష్టం చేసింది. వారం రోజుల్లోపు తొలగించకపోతే, తామే తొలగిస్తామని జీవీఎంసీ జోనల్ కమిషనర్ పేర్కొన్నారు. అంతేగాకుండా, తొలగింపునకు అయ్యే ఖర్చును శారదాపీఠం నుంచే వసూలు చేస్తామని అన్నారు. శారదా పీఠంలో మొత్తం 9 శాశ్వత కట్టడాలు ఉన్నాయని, కొంత స్థలం కూడా ప్రభుత్వ భూమిలో ఉందని వివరించారు. కాగా, శారదా పీఠంలో 22 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని పెందుర్తి తహసీల్దార్ గుర్తించారు.
![]() |
![]() |