సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై పోస్టులు పెట్టిన ఇప్పాల రవీంద్రారెడ్డి.. మంత్రి లోకేష్‌ను కలవడంపై సోషల్ మీడియాలో తీవ్ర రచ్చకు దారి తీసింది. ఈరోజు (మంగళవారం) ఉదయం సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంవోయూ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్‌గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఎంవోయూ మొత్తాన్ని కూడా రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసిన వైనం తెలుసుకొని టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. రవీంద్రారెడ్డి హాజరుపై ఆ తరువాత సోషల్ మీడియాలో తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను కూడా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు మళ్లీ వైరల్ చేస్తున్నారు. లోకేష్‌ను కలిసేందుకు ఇతన్ని ఎలా రానిచ్చారని టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.
![]() |
![]() |