జీఎస్టీ నుండి ఆలయ ప్రసాదాలను మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025పై జరిగిన చర్చలో ఆమె ఈ ప్రకటన చేశారు.ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలపై జీఎస్టీ వర్తించదని ఆమె స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులలో నెలకొన్న అనిశ్చితిని తొలగించే క్రమంలో ఆన్‌లైన్ ప్రకటనలపై విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీ/డిజిటల్ పన్నును రద్దు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025కి ప్రతిపాదించిన 59 సవరణల్లో ఇది కూడా ఒకటి.
![]() |
![]() |