పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యపోయేలా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పర్చూరు నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ఒక హెచ్చరిక జారీ చేశారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీకి అత్యధిక ఓట్లు సాధించేలా కృషి చేసిన వారిని గుర్తిస్తామని చెప్పారు. పనితీరును ప్రామాణికంగా తీసుకుని నేతలు, కార్యకర్తలకు నామినేటెడ్, పార్టీ పదవులు కేటాయించడం జరుగుతుందన్నారు.తనతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసి రేటింగ్‌లు ఇస్తామని చెప్పారు. దాని ద్వారా పనితీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా పక్కన పెడతానని హెచ్చరించారు. సమర్థులకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
![]() |
![]() |