వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింల హక్కులను కాపాడటంపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది వెల్లడయ్యింది అని మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్ధుల్ హఫీస్ ఖాన్ అన్నారు. అయన మాట్లాడుతూ.... దేశం మొత్తం ముస్లిం సమాజానికి ఆయన నిజస్వరూపం తెలిసిపోయింది. 9 లక్షల ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డ్ తన హక్కులను కోల్పోయే పరిస్థితికి కారణమయ్యే ఈ బిల్లును చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదు? ఇంత కుట్ర జరుగుతుంటే నలబై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు? కేంద్రం మొత్తం నితీష్, చంద్రబాబుల మద్దతుపైనే ఆధారపడి ఉంది. కీలకమైన సంఖ్యాబలం ఉన్న చంద్రబాబు ప్రారంభంలోనే ఈ బిల్లును అడ్డుకుని ఉంటే, జేపీసీ దాకా బిల్లు వెళ్ళేదా? ఒకవైపు రాష్ట్రంలో ముస్లింలకు మాయమాటలతో వక్ఫ్ సవరణలో వారికి ఎటువంటి అన్యాయం జరగదంటూ మోసపు హామీలు ఇచ్చారు. మరోవైపు కేంద్రంలో బిల్లుకు మద్దతు పలికి, ఆమోదంకు మార్గం సుగమం చేశారు. ఇదే క్రమంలో జాతీయ మీడియాలో వక్ఫ్ బిల్లును చంద్రబాబు అడ్డుకుంటున్నాడంటూ మరో అబద్దపు ప్రచారం ఘనంగా చేయించుకున్నారు. రెండు నాలుకల దోరణితో ముస్లింలను మాయ చేయాలని చంద్రబాబు అనుకున్నారు. గోద్రా అలర్ల తరువాత నేను మారిన మనిషిని, మైనార్టీల పట్ల అనుకూలంగా ఉంటాను, నాకు అవకాశం ఇవ్వాలని మభ్యపెట్టారు. రాష్ట్రంలో అన్నిచోట్లా ముస్లిం సమాజం ఈ మాటలు నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేశారు. కనీసం రాజ్యసభలో అయినా చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఈ బిల్లును అడ్డుకోవాలి. వైయస్ఆర్‌సీపీ ఈ బిల్లును ప్రజాస్వామ్య విధానాల్లో అడ్డుకుంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైయస్ జగన్ గారు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంను తిప్పికొట్టాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.
![]() |
![]() |