డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు పెంగ్విన్ లు వలస వెళుతున్నాయట.. ఇంతే సి పన్నులు వేస్తే తమ వ్యాపారం ఏంకావాలని ఆందోళన చెందుతున్నాయని, తమ వ్యాపారాలను వేరే ఎక్కడికైనా తరలిస్తామని ట్రంప్ తో తెగేసి చెప్పాయట. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మీమ్ లలో ఇదొకటి. ట్రంప్ టారిఫ్ లపై మీమర్స్ ఇలా ఫన్నీ మీమ్ లతో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల రష్యాతో యుద్ధం నిలువరించేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కలిసిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమావేశం రసాభాసగా మారింది. తాము ఆయుధాలు, క్షిపణులు అందించి సహాయం చేసినా జెలెన్ స్కీ అమెరికన్లకు ఒక్కసారి కూడా ధన్యవాదాలు చెప్పలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విమర్శించారు. ఈ విషయాన్ని టారిఫ్ లకు అన్వయిస్తూ.. ట్రంప్, వాన్స్ లతో పాటు కుర్చీలో కూర్చున్న పెంగ్విన్ తో ఓ మీమ్ క్రియేట్ చేశారు. ట్రంప్ తో భేటీకి సదరు పెంగ్విన్ సూట్ వేసుకుని వెళ్లినా టారిఫ్ లు విధించారంటే బహుశా ఆ పెంగ్విన్ అమెరికన్లకు థ్యాంక్స్ చెప్పలేదేమోనంటూ సెటైర్ వేశారు.
![]() |
![]() |