బఫర్‌తో సంబంధం లేకుండా డీలర్లకు రేషన బియ్యం సరఫరా చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయంత్రం నగరంలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు సంబంధించిన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
రేషన డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వంలో బఫర్ పెండింగ్‌లో ఉంచడం వల్ల ఆ ప్రభా వం తమపై పడుతోందని ప్రస్తుతం ఉన్న డీలర్లు ఇటీవల ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు.
![]() |
![]() |