తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అసత్య ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. గోశాలలో 260 మంది సిబ్బంది గోసంరక్షణ పనులు చేస్తున్నారని, సుమారు 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు.గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. పవిత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం భూమన హయాంలోనే జరిగిందని గుర్తుచేశారు. టీటీడీలో గోవుల మరణాలంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం భూమన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
![]() |
![]() |