ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరీ శ్రీక్షేత్రంలో నీలచక్రంపై ఎగిరే జెండాను పట్టుకెళ్లిన గద్ద

national |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 12:04 PM

పూరీ శ్రీక్షేత్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను ఓ గద్ద పట్టుకెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఈ జెండాను పూరీకి వచ్చే భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. నిత్యం సాయంత్రం 5 గంటలకు జెండా మార్చే సంప్రదాయం ఉంది. అంత పవిత్రమైన జెండాను ఎన్నడూ లేనివిధంగా ఓ పక్షి లాక్కెళ్లడంతో భక్తులు వింతగా చూశారు. దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇంతకూ ఈ జెండా ప్రత్యేకత ఏమంటే.. పూరీకి వచ్చే భక్తులంతా తొలుత ఈ జెండా (పతిత పావన జెండా)ను దర్శనం చేసుకుంటారు. చేతులెత్తి మొక్కిన తర్వాత మాత్రమే ఆలయంలోని జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఈ జెండాను ఆలయ శిఖరం మీద ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు దీన్ని మారుస్తూ ఉంటారు. ఇదేమీ చిన్నా చితకా జెండా కాదు. ఏకంగా 14 మూరలు ఉంటుంది.ఆలయ శిఖరం మీద ఎగిరే ఈ జెండాకు దిగువన భక్తులు సమర్పించే మొక్కుబడుల జెండాను కడతారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఒక గద్ద వచ్చి.. జెండాను లాక్కెళ్లం సంచలనంగా మారింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతం.. ఏం జరగటానికి ఇది సంకేతమన్న మాటను కొందరు పూజారుల నోట వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com