ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన కరణ్ జోహార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 10:11 AM

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తండ్రి అయ్యాడనే విషయాన్ని బాలీవుడ్ మీడియా చెబుతుంది. సరోగసి విధానం ద్వారా ఓ బాబు, ఓ పాప(కవలలు)కి ఆయన తండ్రి అయ్యాడని అంటున్నారు. ఈ ఇద్దరు పిల్లలు ముంబై అంధేరిలోని మస్రానీ హాస్పిటల్ లో జన్మించగా ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా తన పేరుని బర్త్ సర్టిఫికెట్ లో రిజిస్టర్ చేయించుకున్నాడట కరణ్ జోహార్. తల్లి పేరును మాత్రం మెన్షన్ చేయకపోవడం గమనర్హం. అయితే ఫిబ్రవరిలోనే ఈ ఇద్దరు పిల్లలు జన్మించినప్పటికి ఈ శుక్రవారం రోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఇద్దరు పిల్లల పేర్లను రిజిస్టర్ చేయించాడట. కరణ్ ఇటీవల తన రాసుకున్న ఆటోబయోగ్రఫీలో పిల్లలను దత్తత తీసుకుంటాను లేదంటే సరోగసి ద్వారా పిల్లలకు తండ్రిని అవుతాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ మధ్య నటుడు తుషార్ కపూర్ కపూర్ కూడా సరోగసీ ద్వారానే ఓ బేబి బాయ్ కి తండ్రి అయ్యాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa