ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో మ‌రో భార‌తీయుడిపై కాల్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 10:13 AM

వాషింగ్ట‌న్‌: మొన్న తెలుగు యువ‌కుడు కూచిబొట్ల శ్రీనివాస్‌.. నిన్న హ‌ర్నీష్ ప‌టేల్‌.. తాజాగా ఓ సిక్కు వ్య‌క్తి.. అమెరికాలో జాత్యాంహ‌కారం బుస‌లు కొడుతూనే ఉన్న‌ది. భార‌తీయుల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం రాత్రి 39 ఏళ్ల ఓ సిక్కు వ్య‌క్తిపై ఓ గుర్తు తెలియ‌ని అమెరిక‌న్ కాల్పులు జ‌రిపాడు. మీ దేశానికి వెళ్లిపో అంటూ ఆ వ్య‌క్తి కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు తెలిపారు. కెంట్ సిటీలో ఉంటున్న ఆ సిక్కు వ్య‌క్తి ఇంటి బ‌య‌ట త‌న వాహ‌నాన్ని శుభ్రం చేస్తుండ‌గా ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి అత‌ని ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన త‌ర్వాత అత‌ను షూట్ చేశాడు. త‌న‌ను స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆ వ్య‌క్తి డిమాండ్ చేసిన‌ట్లు బాధితుడు చెప్పాడు. ఆ త‌ర్వాత ఆ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి సిక్కు వ్య‌క్తి చేతిపై కాల్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa