ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంపూర్ణ సూర్యగ్రహణం...మళ్ళీ మరో 16 ఏళ్ల తర్వాతే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 07:48 PM

ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం డిసెంబరు 26న ఏర్పడుతోంది. శాస్త్రీయ కోణంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖపైకి రావడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. మధ్యలో భూమి ఉంటుంది. ఈ మూడూ ఒకే సరళరేఖపైకి చంద్రుడి మధ్యలో ఉండి ఆ ఆ నీడ సూర్యుడిపై పడి పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ కనిపించకపోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది. కానీ, అన్ని అమావాస్యల్లో సూర్యగ్రహణాలు ఏర్పడవు. సాధారణంగా సంవత్సరానికి ఐదు నుంచి ఏడు గ్రహణాలు ఏర్పడతాయి. వీటిలో 5 సూర్య, 2 చంద్ర గ్రహణాలు (లేదా) 4 సూర్య గ్రహణాలు, 3 చంద్ర గ్రహణాలు ఉండే అవకాశం ఉంది. ప్రతి పదేళ్లకు గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమం పునరావృతం అవుతుంది. ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవించనుంది. సూర్యహణం మార్గశిర బహుళ చతుర్దశి మూల నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి కర్కాటకం, తుల, కుంభం, మీన రాశుల వారికి శుభం.. మేషం, వృషభ, మిథున, సింహ రాశుల వారికి మధ్యమం.. కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని జ్యోతిషులు చెబుతున్నారు. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకంగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు దీనిని పాటిస్తున్నారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశంలో మాయమై చీకటి కమ్ముకోవడంతో భయభ్రాంతులకు గురయ్యేవారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గాయి. అయితే, గర్భిణీలపై గ్రహణం ప్రభావం చూపుతుందని బలంగా నమ్ముతారు. ఇది మూఢనమ్మకమా, శాస్త్రీయ కోణమా అనేది పక్కనబెడితే గర్బిణిలు కొన్ని సూచనలు పాటించాలి. గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే భోజనం ముగించాలి. గ్రహణం మొదలైన తర్వాత ఆహారం తీసుకోరాదట. రాహు, కేతువుల చంద్రుడ్ని మింగినప్పుడు వాటి లాలాజలం భూమిపై పడుతుందని, ఇవి విషపూరితమైనవి పెద్దలు అంటారు. కాబట్టి ఆ సమయంలో ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయని నమ్మకం. గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపుతుందని, తద్వారా పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ ప్రభావం పడకుండా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అంటే తినే పదార్థానికి అరగడానికి సరైన సమయం అన్న మాట. సైసైన్స్ పరంగా చూస్తే గ్రహణం రోజున విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల వల్ల ఆహారపదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగి, బ్యాక్టీరియా అధికమవుతుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గ్రహణాన్ని చూడరాదని, చూడటం వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో ఉంటారని చెబుతారు. ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించి, నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని అంటారు. గ్రహణ స్పర్శ కాలంలో నదీస్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం చేయడం మంచిది. గ్రహణ కాలంలో భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్ర జపం, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపం, ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించాలి. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేసి, గ్రహణ సమయంలో గో భూ హిరణ్యాది దానాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి జన్మరాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం ఏర్పడితే వారికి విశేషముగా పూజలు, జపాలు, దానాలు చేసుకోవలెను. గ్రహణం పడిన నక్షత్రమందు ఆరు నెలలు ముహూర్తాలు నిషేదిస్తారు. జన్మరాశి నుండి 3,6,10,11 రాసులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాసులందు గ్రహణమైన మధ్యమం. మిగిలిన రాసులందు గ్రహణమైన అరిష్టం. మతాంతరంలో గార్గుడు జన్మరాశి నుంచి 7,8,9,10,12 లలో గ్రహణమైతే అరిష్టమని, రాహువు జన్మ నక్షత్రం లేదా 7 వ నక్షత్రంలో ఉన్నా అరిష్టమని తెలియజేశాడు. మరొక మతాంతరంలో రాహు కేతువులు ఏ నక్షత్రంలో ఉండి సూర్య,చంద్రులను మింగుతాడో ఆ నక్షత్ర జాతకులకు చెడు జరుగుతుందని వివరించాడు. మరొక మతాంతరంలో గ్రహణం త్రిజన్మ నక్షత్రాలలో అనగా జన్మ నక్షత్రానికి ముందు నక్షత్రం, వెనుక నక్షత్రాలలో పడుతుందో వారు రోగగ్రస్తులవుతారని చెప్పడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa