మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుటుంబ సభ్యుడు అజిత్ పవార్ కు నీటిపారుదల శాఖ స్కాంలో ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. విదర్భ నీటిపారుదల కుంభకోణంలో ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ నాగపూర్ బెంచ్ ముందు ఓ అఫిడవిట్ ను దాఖలు చేశారు.
విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 12 ప్రాజెక్టుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని ఏసీబీ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. తమ దర్యాప్తులో ఈ విషయం తేలిందని ఏసీబీ డీజీ వెల్లడించారు. మొత్తంమీద ఇరిగేషన్ స్కాంలో అజిత్ పవార్ కు ఏసీబీ క్లీన్ చిట్ ఇవ్వడం మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa