విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి కల్పించిన విదేశీ విద్యా పథకం ఉపకార వేతనాలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గత 12 రోజులుగా కలెక్టరేట్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని బుధవారం జనసేన నేతలు సందర్శించి వారికి తమ మద్దతు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశీ విద్యా ఉపకార వేతనాలను నిలిపివేసినట్లు బోనబోయిన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణం విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఆళ్ల హరి, తన్నీరు గంగరాజు, ప్రజా సంఘాల నాయకులు దొంత సురేష్, ఖాజవలి, చిరతనగండ్ల వాసు, జూపూడి శ్రీనివాస్, మగ్బూల్ జాన్ తదితరులు ఉన్నారు.