గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టాభిపురం కాలనీ లో కోడి పందేల స్థావరంపై తాడేపల్లి ఎస్ ఐ నారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పందెం రాయుళ్లు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 2700 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చనున్నట్లు ఎస్ ఐ నారాయణ తెలిపారు. తాడేపల్లి పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.