పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టిశ్రీరాములు అని చంద్రబాబు కీర్తించారు. అమరజీవి జయంతి సందర్భంగా మంగళగిరి జాతీయ రహదారి వద్ద ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. తెలుగు దేశంలో ఉన్న తమను ప్రభుత్వం ఎలా వేధింపులకు గురిచేస్తుందో కార్యక్రమంలో నేతలు వివరించారు. అధికారులను, పోలీసులను పంపి తమను వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాపారస్తులు వాపోయారు. తమకు కూడా అట్రాసిటీ లాంటి ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పించాలని వారు విన్నవించారు. ప్రభుత్వ చర్యను విమర్శిస్తే కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.