అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ తులసి కిరాణా షాప్ లో గుర్తు తెలియని వ్యక్తి డోరు తాళాలు పగలగొట్టి గల్లాపెట్టె లో ఉంచిన డబ్బులు దొంగలించిన ఘటన పెద్దకూరపాడు లో జరిగింది.
ఎస్ ఐ ఎం. సత్యనారాయణ కథనం ప్రకారం.. పెద్దకూరపాడు లోని లక్ష్మీ తులసి కిరాణా షాపులో సరుకులు అమ్మగా వచ్చిన 60 వేల రూపాయలు ను గల్లా పెట్టి లో ఉంచి రాత్రి 11: 00 సమయంలో షాప్ కి తాళం వేసి కిరాణా షాపు పై అంతస్తులోకి షాపు యజమానులు వెళ్లారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత 1: 40 నిమిషాలకు కిరాణా షాప్ లోకి వెళ్లి తలుపుతాలాన్ని పగలగొట్టి కొట్టు లోకి వెళ్లి గల్లాపెట్టె లో ఉన్న 60, 000 వేల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ చేతులకు గ్లౌజులు వేసుకుని డబ్బలు దొంగలించాడు.
ఈ సంఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉంది. డాగ్ స్క్వాడ్ జాగిలమ్ షాపులో తిరిగి పెద్దకూరపాడు లోని సాయిబాబా దేవాలయం సమీపం వరకు వెళ్లి ఆగింది. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించారు.
కిరాణా షాపు యజమాని పొట్టి రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారుతెలిపారు మరో రెండు చోట్ల కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించినట్లు తెలిసింది.