బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో జరుగు క్రికెట్ టోర్నమెంట్‌కు ఆదోని న్యాయవాదులు బుధవారం బయలుదేరి వెళ్లారు. ఎపీలో ఉన్న న్యాయవాదులకు క్రీడలు నిర్వహించాలన్న లక్ష్యంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు.
ప్రతి జిల్లా నుంచి నాలుగు టీంలను టోర్నమెంట్‌లో పాల్గొనే విధంగా సూచించడంతో కర్నూలు జిల్లా నుంచి నాలుగు టీంలు ఉండగా అందులో ఆదోని నుంచి మధుసూదన్, ఖలందర్, విష్ణు, మల్లికార్జునలు ఒక టీంగా ఏర్పడి విశాఖకు బయలుదేరి వెళ్లడంపై తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.