ఆ బాలికది తెలిసీ తెలియని వయసు. అందంగా ఉన్న ఆ బాలికపై ఓ కేటుగాడు కన్నేశాడు. మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఆమెకు కావాల్సినవన్నీ కొనిచ్చేవాడు. చివరికి పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి, పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను మభ్యపెట్టి, హోటళ్లలో మకాం వేస్తూ అనుభవించాడు. చివరికి పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సురేంద్రనగర్ గ్రామానికి చెందిన దినేష్ బాబుల్ అనే యువకుడు జులాయిగా తిరుగుతుండే వాడు. పొరుగునే అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న ఓ బాలికపై అతడు కన్నేశాడు. మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక వ్యవహారం తెలిసిన ఆమె తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా తమ కుమార్తెను స్వగ్రామానికి తీసుకెళ్లిపోయారు.
ఓ రోజు వారి గ్రామానికి వెళ్లి అమ్మాయిని తీసుకుని దినేష్ బయటకు వెళ్లిపోయాడు. లాడ్జిలలో గది తీసుకుని, ఆ అమ్మాయిని ఉంచాడు. పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. కుమార్తె తప్పిపోవడంతో బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో తల్లిదండ్రులు వెతికారు. దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో దినేష్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేపట్టి, బాలికను అతడి చెర నుంచి తప్పించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.