లావణ్య త్రిపాఠికి అర్జున్ సురవరం రూపంలో హీరోయిన్ రీసెంట్ గా మంచి హిటే వచ్చింది. అయితే టాలెంట్ అండ్ గ్లామర్ ఉన్నా తన కెరీర్ ఆశించిన స్థాయిలో కొనసాలేదు. కనీసం ఈ అర్జున్ సురవరం సక్సెస్ తోనైనా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని అమ్మడు బాగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఎలా ఉన్నా.. ఓ యంగ్ హీరో సినిమాలో మాత్రం నటించబోతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న “చావు కబురు చల్లగా” చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించబోతుందట. అయితే మేకర్స్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa