అలవైకుంఠపురంలో సినిమాతో త్రివిక్రమ్ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తన తరువాత సినిమాను ప్రకటించాడు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ చిత్రానికి అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ప్రచారం జరిగినప్పటికీ తాజాగా ఈ సినిమాకి మరో టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. టైటిల్ అన్ని భాషల్లో ఈజీగా రీచ్ అవ్వాలంటే అచ్చ తెలుగు టైటిల్ కాకుండా అందరికి అర్ధం అయ్యే విధంగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa