బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై అమీర్ నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్ సరసన జైరా వాసిం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఫస్ట్ లుక్ లో జైరా వాసిం స్కూల్ డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వెళుతున్నట్లు చూపించారు. ఈ సినిమాలో జైరా వాసిం గాయని కావాలని ఆశపడుతుందట. తన తండ్రి రోజు తాగి వచ్చి తనని, అమ్మని చిత్రహింసలు పెడుతుంటాడట. తన తల్లిని తాగుబోతు తండ్రి నుంచి కాపాడుకొని తన ఆశయం ఎలా నెరవేర్చుకుంటుంది అన్న ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 2న విడుదల కాబోతుండగా.... చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa