సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.తమిళ నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా,సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు అని ఫిలింఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నారు.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సమయంలో చరణ్ స్నేహితుడిగా శ్రీకాంత్ నటిస్తున్నట్లుగా సమాచారం.2023 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేయాలనీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa