పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా, తదుపరి వరస ప్రెస్టీజియస్ సినిమాలలో భాగమయ్యింది. అల్లుఅర్జున్ తో పుష్ప2, తలపతి విజయ్ వారసుడు రష్మిక నటించే సౌత్ సినిమాలైతే, గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్ రష్మిక నటించే హిందీ సినిమాలు.
చేతినిండా సినిమాలు, అప్పుడప్పుడు ప్రమోషనల్ కంటెంట్స్ తో బిజీగా ఉండే రష్మిక తాజాగా మరొక బాలీవుడ్ అఫర్ ను కొట్టేసిందని సమాచారం. శశాంక్ - టైగర్ ష్రాఫ్ కాంబోలో తెరకెక్కబోయే యాక్షన్ ప్యాక్డ్ సినిమాలో రష్మిక లీడ్ హీరోయిన్ రోల్ లో నటించబోతుందట. ఈ సినిమా కోసం ఫ్రెష్ ఫేస్ ను పరిశీలిస్తున్న మేకర్స్ రష్మిక ఐతే తమ సినిమాకు తగిన న్యాయం చేస్తుందని ఏరికోరి ఆమెను సెలెక్ట్ చేశారట. ఈ విషయంలో అధికారికంగా త్వరలోనే క్లారిటీ రానుంది.
![]() |
![]() |