టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ". శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదల కావాల్సివుంది కానీ, కొన్ని కారణాల వల్ల జూలై 29కి వాయిదా పడింది.
RT టీం వర్క్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నఈ చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మాస్ ట్రైలర్ లోడింగ్... అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంటే, త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ విడుదల కాబోతుందన్న మాట.
![]() |
![]() |