జెడి-జెర్రీ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శరవణన్ అరుల్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ది లెజెండ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో శరవణన్ అరుల్ సరసన ఊర్వశి రౌతేలా లేడీ లవ్ గా కనిపించనుంది. ఈ చిత్రం 2022 జూలై 28న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో యాషిక ఆనంద్ నటించిన స్పెషల్ పాటను ఈరోజు విడుదల చేశారు. నాజర్, ప్రభు, వివేక్, యోగి బాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాకు హరీష్ జైరాజ్ సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa