రామ్ చరణ్ తేజ్ తన 15వ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ ను హైదరాబాద్‌లో జరిపేందుకు రెడీ అయ్యారు. సరూర్‌నగరల్‌లో విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో షూటింగ్ చేసేందుకు వెళ్లగా, స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి సోమవారం అడ్డుకున్నారు. స్కూళ్లు నడుస్తున్న సమయంలో షూటింగ్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. దీంతో చిత్ర యూనిట్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.