నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ మూవీలో క్యాథెరిన్ థెరెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు. హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో, మేకర్స్ ప్రమోషన్స్ ను ముమ్మరం చేసారు. లేటెస్ట్ గా బింబిసార నుండి కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీనివాస రెడ్డి ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇందులో "జుబేదా" గా నటిస్తున్న శ్రీనివాస రెడ్డి లుక్స్ కామిక్ గా, ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.