సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తి చేశారు. తొలుత సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. పలువురు టాలీవుడ్ పెద్దలు, రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర మహాప్రస్థానానికి చేరుకుంది. బరువెక్కిన గుండెతో మహేష్ బాబు తన తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్‌ను అలా చూసి, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.