నిన్న సాయంత్రం విడుదలైన గాడ్ ఫాదర్ నజభజ సాంగ్ యూట్యూబుని షేక్ చేస్తుంది. తమన్ ఇచ్చిన మాస్ కంపొజిషన్, అనంత శ్రీరామ్ ఇచ్చిన మాస్సీ లిరిక్స్ ... వెరసి ఈ పాటకు ప్రేక్షకాభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు, హిందీ భాషలలో కలుపుకుని మొత్తం ఈ పాటకు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది.
మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమా పై అటు హిందీలో, ఇటు తెలుగులో భారీ అంచనాలున్నాయి. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా అక్టోబర్ ఐదవ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం కాబోతుంది.
పోతే, ఇంకాసేపట్లోనే అంటే రాత్రి ఎనిమిదింటికి గాడ్ ఫాదర్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ట్రైలర్ కోసం మెగా అభిమానులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.