ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివిఆర్ కి గ్యాంగ్ లీడర్ కి సంబంధం లేదు : రామ్ చరణ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 10, 2019, 04:51 PM

చరణ్ .. బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'వినయ విధేయ రామ' .. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చరణ్ తీరికలేకుండా వున్నాడు. ఇదిలా ఉంచితే, ఈ సినిమా కథకు .. 'గ్యాంగ్ లీడర్' కథకు కొన్ని దగ్గర పోలికలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో చరణ్ దీనిపై మాట్లాడుతూ .. 'గ్యాంగ్ లీడర్' తరహాలో హీరో బ్రదర్ ఈ సినిమాలో చనిపోతాడు .. దాంతో హీరోనే ఆ కుటుంబానికి అండగా నిలబడతాడు.

ఈ కారణంగానే ఈ కథకు .. 'గ్యాంగ్ లీడర్' కథకు దగ్గర పోలికలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ 'వినయ విధేయ రామ' సినిమాకి .. 'గ్యాంగ్ లీడర్' సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకైతే అలా ఎప్పుడూ అనిపించలేదు. మా సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఎవరికీ కూడా 'గ్యాంగ్ లీడర్' గుర్తుకురాదు .. అందులో ఎలాంటి సందేహంలేదు" అని చెప్పుకొచ్చాడు. సంక్రాంతి బరిలోకి దిగుతోన్న ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa