టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ, శాలినీ పాండే హీరో హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది. దీంతో తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షన్ తెరకెక్కిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా తాజాగా తెలుగు అర్జున్ రెడ్డి విజయ్, హిందీ ప్రీతి కియారాలు ఓ ఈవెంట్‌లో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ ఈవెంట్‌లో విజయ్, కియారా అద్వాని కలిశారు. బాలీవుడ్ టాప్ స్టార్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ హాటెస్ట్ స్టైలిస్ట్‌గా అవార్డు అందుకున్నాడు. విజయ్ తోపాటు షారూఖ్ ఖాన్ దంపుతులు, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లతో పాటు మరికొంతమంది బాలీవుడ్ యంగ్ స్టార్స్ ఈకార్యక్రమంలో సందడి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa