వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 25 వ చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు – అశ్వినిదత్ – ప్రసాద్ వీ పొట్లూరి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కు అమెరికా ఎపిసోడ్‌లో ఒక కొలీగ్ పాత్రలో మీనాక్షి దీక్షిత్ మెరవనుందట. దూకుడు చిత్రం టైటిల్ సాంగ్‌లో ఈ భామ ఆడిపాడింది. మెయిన్ హీరోయిన్ పూజాహెగ్డే అయినా మహేష్-మీనాక్షిల మధ్య కాస్త రొమాన్స్ టచ్ ఉంటుందట. మహేష్ ప్రొఫెషనలిజంకు సాటిలేదని మీనాక్షి తెలిపింది. మహేష్‌తో పని చేయడం ఒక సూపర్ ఎక్స్‌పీరియెన్స్ అని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa