కోలీవుడ్ హీరో ఇళయ దళపతి విజయ్ చాలా ప్రత్యేకమైన హీరో. సెలెబ్రిటీ అయినప్పటికీ బయట సామాన్యుడిలానే మసలుకుంటాడు. అభిమానుల కోసం మంచి మంచి పనులు కూడా చేస్తుంటాడు. ప్రతీ ఏడాది విజయ్ కొంతమంది కార్మికులకు భోజనాలు పెట్టిస్తాడు. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని మే ఒకటో తేదీన చేపట్టాలని అనుకున్నాడట కానీ ఎన్నికలు జరగుతుండటంతో కుదరలేదు. ఎన్నికలు అయిపోయాయి.. ఎన్నికల కోడ్‌ను ఎత్తేసిన సందర్భంగా విజయ్ టీం ఆటోడ్రైవర్ అభిమానులకు భోజనాలు పెట్టింది. భోజనాలు అయ్యాక అందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ హాజరు కాలేకపోయాడు. విజయ్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని సమాచారం. విజయ్ చేసిన మంచిపనిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలా ప్రతీ ఏడాది అభిమానులతో ప్రత్యేకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సమావేశం అవుతుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa