by Suryaa Desk | Wed, Jan 15, 2025, 05:28 PM
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన VD12తో బలమైన పునరాగమనం చేయాలని విజయ్ దేవరకొండ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొంతకాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ శరవేగంగా సాగుతోంది మరియు 80% షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టీజర్ మరియు గ్లింప్స్ త్వరలో విడుదల కానున్నాయి. గౌతమ్ ఈ చిత్రానికి కథ అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.
Latest News