by Suryaa Desk | Wed, Jan 15, 2025, 06:05 PM
తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ బ్యాక్-టు-బ్యాక్ రిలీజ్‌లకు సిద్ధమవుతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. తాజాగా ఇప్పుడు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. గుడ్ బ్యాడ్ అగ్లీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా త్రిష నటిస్తుంది. అర్జున్ దాస్, సునీల్, ప్రసన్న ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకి సిద్ధంగా ఉంది.
Latest News