by Suryaa Desk | Wed, Jan 15, 2025, 08:07 PM
మంచు ఫ్యామిలీ సమస్యలు తీరడం లేదు. కొద్దిసేపు మౌనం తర్వాత మంచు ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, మంచు మనోజ్ ఆయన భార్య భూమా మౌనిక భారీ ర్యాలీతో మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీ విద్యానికేతన్ క్యాంపస్‌లోకి దంపతులు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మంచు మనోజ్ వచ్చిన విషయం తెలుసుకున్న సెక్యూరిటీ వారు క్యాంపస్‌లోకి వెళ్లకుండా గేట్లను మూసివేసి అడ్డుకున్నారు. ఈ సమయంలో మంచు విష్ణు క్యాంపస్‌లోనే ఉన్నాడు. మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయంలో దిగి మోహన్ బాబు యూనివర్శిటీ వైపు ర్యాలీగా బయలుదేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఇటీవల మోహన్ బాబు మరియు విషు సంక్రాంతిని తిరుపతిలో జరుపుకోగా, మనోజ్ మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్‌లతో కలిసి జరుపుకున్నారు.
Latest News