by Suryaa Desk | Wed, Jan 15, 2025, 08:15 PM
లూధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మూన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై మహేష్ చందు నిర్మించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాబోయే క్షుద్ర థ్రిల్లర్ పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సంయుక్తతో కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం శతాబ్దాల నాటి దశావతార దేవాలయం చుట్టూ తిరుగుతుంది. ఇటీవలే మేకర్స్ ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను ప్రదర్శిస్తూ టైటిల్ గ్లింప్స్‌ను ఆవిష్కరించారు. లియోన్ జేమ్స్ శక్తివంతమైన బ్యాక్‌డ్రాప్ స్కోర్ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎలివేట్ చేసింది. విష్ణు అవతారాలను చిత్రించడంలో స్పష్టమైన దృష్టిని ప్రదర్శిస్తూ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం మెరిసింది. మూన్‌షైన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు, సిజి వర్క్, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఆర్ నైపుణ్యం, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర తంగాల సహకారాలు అనుభవాన్ని పెంచాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గ్లింప్సె 6 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 35% చిత్రీకరణ పూర్తికావడంతో టైటిల్ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సినిమాకి శివేంద్ర కెమెరా క్రాంక్ చేయగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News